31-03-2025 06:12:37 PM
మాజీ జెడ్పిటిసి, కాంగ్రెస్ నాయకులు, ద్రోణవల్లి సతీష్..
బాన్సువాడ (విజయక్రాంతి): ముస్లిం సోదరులు ఏడాదికొకసారి రంజాన్ పండుగను కుల మతాలకతీతంగా ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని బీర్కూర్ మండల కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సభ్యుడు, ద్రోణవల్లి సతీష్ అన్నారు. సోమవారం రంజాన్ వేడుకల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కుల మతాలకతీతంగా ముస్లిం సోదరులను కలిసి శుభాకాంక్షలు తెలపడం రంజాన్ వేడుకల్లో జరుగుతుందన్నారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కుర్ మండలం బైరాపూర్ గ్రామంలో రంజాన్ పర్వదిన సందర్భంగా మైనార్టీ సోదరులు మసీదు వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాజీ జెడ్పిటిసి సభ్యుడు ద్రోణవల్లి సతీష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని కుల మతాలకు అతీతంగా రంజాన్ పండుగ గౌరవప్రదమైనదన్నారు. ప్రతి ఒక్కరిపై అల్లా ప్రేమ, దయ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నాయకులు ముస్లిం సోదరులు యూసుఫ్, షేక్ సలీం, మైనొద్దీన్ తదితరులు పాల్గొన్నారు.