calender_icon.png 2 April, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు

01-04-2025 02:55:19 AM

  • ఈద్గా మైదానాల్లో ప్రార్థనలు చేసిన ముస్లింలు
  • శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు, పార్టీల నేతలు

విజయక్రాంతి నెట్‌వర్క్, మార్చి 31 : రంజాన్ పండుగ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ముస్లింలు భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ మండలాల్లోని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొ న్నారు. మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ రంగినేని మనీషా, టీపీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షులు సాజిత్ ఖాన్, కిసాన్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచి శ్రీకాంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.

బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ రంజాన్ వేడుకల్లో పాల్గొన్నారు. మంచిర్యాల నియోజకవ ర్గంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు నియోజవర్గంలో ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెం కటస్వామిలు పలు ఈద్గాలను సందర్శించి ముస్లిం సోదరులకు రంజాన్ పండు గ శుభాకాంక్షలు తెలిపారు. మంచిర్యాల పట్టణంలో క్యారీ ఈద్గా వద్ద, బస్టాండ్ కబ్రస్థాన్ వద్ద ముస్లింలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు శుభాకాంక్షలు తెలిపారు.

ముస్లిం మైనార్టీలకు అసిఫాబాద్ లో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మె ల్యే ఆత్రం సక్కు, కాగజ్ నగర్ లో ఎమ్మెల్సీ తండేబిటల్ పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల, నాయకుల ఇండ్లకు వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా రం జాన్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. కాగజ్ నగర్  మండలం లోని ఈద్గా వద్ద ముస్లిం మైనారిటీలు ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.

ఎమ్మెల్సీ దండేవిటల్, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, పలు రాజకీయ నాయకులు ముస్లింలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మందమర్రి పట్టణ పరిధిలోని సోమవారం సిఈఆర్ క్లబ్ సమీపంలో, విద్యానగర్‌లోని ఈద్గాల వద్ద రంజాన్ పర్వ దినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత నిస్తుందని వారి అభివృద్ధికి కృషి చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి స్పష్టం చేశారు.

రంజాన్ పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు రంజాన్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకునేందుకు జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టి బందోబస్తు ఏర్పాటు చేసింది.

ఈద్గా మైదానం వద్ద శాంతి భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్వయంగా పర్యవేక్షించారు. డీఎస్‌పీ జీవన్ రెడ్డి, సీఐలతో కలిసి  ఈద్గా పక్కన ఉన్న పాత జాతీయ రహదారిపై మైనార్టీల ప్రార్థన సందర్భంగా కాసేపు వాహనాల రాకపోకలను నిలిపివేశారు.

మైనార్టీల నిరసన

కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణపై తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు ఈద్గా మైదానాల వద్ద నల్ల బ్యాడ్జీలను ధరించి, ప్లకార్డులను  చేత పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.