31-03-2025 05:08:00 PM
ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు..
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): రంజాన్ పండగను పురస్కరించుకొని ముస్లిం మైనారిటీలు సోమవారం ఈద్గా వద్ద భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పండుగ యొక్క ప్రాముఖ్యతను మత గురువులు బోధించారు. నెలరోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం మైనారిటీలు రంజాన్ పండుగ సందర్భంగా నివాసాలలో పిండివంటలు, ప్రత్యేక వంటకాలు చేసి స్నేహితులు, బంధువులకు ఆతిథ్యాన్ని అందించారు.
పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీలకు అసిఫాబాద్ లో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, కాగజ్ నగర్ లో ఎమ్మెల్సీ తండేబిటల్ పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీ కార్యకర్తల, నాయకుల ఇండ్లకు వెళ్లి ఆతిథ్యాన్ని స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా రంజాన్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి.