calender_icon.png 2 April, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మతసామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ

31-03-2025 01:52:39 PM

బీఆర్ఎస్ పార్టీ మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్

పెన్ పహాడ్:  మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న రంజాన్ పండుగను సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలంలోని వివిధ గ్రామాలలో ముస్లిం సోదరులు సోదరీమణులు ఈద్గా లో ప్రార్థనలు జరుపుకున్నారు. ఈసందర్బంగా పెన్ పహాడ్ మండల బిఆర్ఎస్ పార్టీ మండల ముస్లిం మైనారిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతారంలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న తరువాత ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంజాన్ పండగ పవిత్రతకు త్యాగానికి చిహ్నమైన పండగను  భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సవాలతో జరుపుకోవడం సంతోషకరమన్నారు. సేవ, దృక్పథ, భక్తి ప్రవృత్తులు  సోదర భావాలు మతసామరస్యాన్ని చాటి చెప్పే ఈ పండుగను మండల వ్యాప్తంగా ముస్లిం సోదర సోదరీమణులు అందరు సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎండి షరీఫ్, షేక్ చాంద్, హుస్సేన్, అక్బర్, జానీ, షఫీ,ఉస్మాన్,ఖాదర్, సాజిద్, యాకూబ్, మదర్, సయ్యద్ తదితరులు పాల్గొన్నారు.