calender_icon.png 2 April, 2025 | 1:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రంజాన్ వేడుకలు

01-04-2025 12:33:16 AM

- ముస్లింల ప్రత్యేక ప్రార్థనలు

పటాన్‌చెరు, మార్చి 31 : పటాన్ చెరు నియోజకవర్గ వ్యాప్తంగా రంజాన్ వేడుకలను ముస్లింలు సోమవారం  భక్తిశ్రద్దలతో జరుపుకున్నారు. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లింలు ఈదుల్ ఫితర్ సందర్భంగా ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరికొకరు అలయ్ బలయ్ తో శుభాకాంక్షలు చెప్పుకున్నారు. రంజాన్ సందర్భంగా పలువురు ముస్లింలు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జీ కాట శ్రీనివాస్, నీలం మధు, పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతీనగర్ కార్పొరేటర్ లు కుమార్ యాదవ్, పుష్పనగేశ్, సిందు ఆదర్శ్ రెడ్డి, తెల్లాపూర్, అమీన్ పూర్, ఐడీఏ బొల్లారం మున్సిపల్ నాయకులు సోమిరెడ్డి, పాండు రంగారెడ్డి, కొలను బాల్రెడ్డి, చంద్రారెడ్డి, నర్సింహా గౌడ్ తదితరులు ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, ఆయన కొడుకు గూడెం విక్రమ్ రెడ్డి, బీఆర్‌ఎస్ యువనేత పృథ్వీరాజ్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.