calender_icon.png 2 April, 2025 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా రంజాన్ వేడుకలు

31-03-2025 07:04:37 PM

మందమర్రి (విజయక్రాంతి): నెల రోజుల కఠిన ఉపవాసాల అనంతరం నెలవంక దర్శనంతో ముస్లిం సోదరులు రంజాన్ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. సోమవారం పట్టణంలోని సిఈఆర్ క్లబ్ సమీపంలో, విద్యానగర్ లోని ఈద్గాల వద్ద రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్బంగా మత గురువులు పండుగ యొక్క ప్రాముఖ్యతను బోధించారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు.

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణ సీఐ శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై రాజశేఖర్ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. మైనారిటీల అభివృద్ధికి కృషి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తుందని వారి అభివృద్ధికి కృషి చేస్తుందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. రంజాన్ పురస్కరించుకొని సోమవారం పట్టణంలోని ఈద్గాల వద్ద ముస్లిం సోదరులను ఆలింగనం చేసుకుని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... చెన్నూర్ నియోజకవర్గంలో ఈద్గా, దర్గాలను అభివృద్ధి చేయడంతో పాటు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.