31-03-2025 01:23:25 PM
ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్న ముస్లిం సోదరులు
భద్రాచలం,(విజయక్రాంతి): రంజాన్ పండుగ సందర్భంగా భద్రాచలంలోని ఏఎంసి కాలనీ దగ్గర ఉన్న ఈదుగాలో ముస్లిం సోదరులందరూ సోమవారం ఈద్గా నమాజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు మాట్లాడుతూ... భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం సోదర భావంతో ఉండాలని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈద్గాలో ప్రార్థన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత పెద్దలు షఫీ, అబ్దుల్లా, మునాఫ్, అజీమ్, జిందా, సలీం, నవాబ్ , ఆలీ భాష , అక్బర్, రబ్బన, సరఫరాజ్, రహీం తదితరులు పాల్గొన్నారు.