calender_icon.png 17 October, 2024 | 12:29 AM

సిద్దిపేట విద్యుత్ శాఖ డీఈగా రామచంద్రయ్య

16-10-2024 09:07:29 PM

సిద్దిపేట,(విజయక్రాంతి): విద్యుత్ శాఖలో జరిగిన బదిలీలలో భాగంగా సిద్దిపేట డివిజనల్ ఇంజనీర్ గా కే.రామచంద్రయ్య బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ డివిజన్లో టెక్నికల్ డివిజనల్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న రామచంద్రయ్య సాధారణ బదిలీపై సిద్దిపేట డివిజనల్ కార్యాలయంలో ఇంజనీర్ గా వచ్చారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఇంజనీర్ జి మహేష్ కుమార్ హైదరాబాద్ కు బదిలీపై వెళ్లారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన సిద్దిపేట డివిజనల్ ఇంజనీర్ కే.రామచంద్రయ్యను కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.