07-02-2025 04:47:52 PM
ఆదిలాబాద్ (విజయక్రాంతి): అదిలాబాద్ జిల్లా మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రమాబాయి అంబేద్కర్ 127వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సంఘ భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రమాబాయి అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షులు కొప్పుల రమేష్ మాట్లాడుతూ... అంబేద్కర్ లండన్ లో చదువుతున్న సమయంలో తాను పస్తులున్న కానీ అంబేద్కర్ కు తెలియకుండా తన పిల్లలకు ఒక పూట భోజనం చేయడానికి సైతం కష్టం ఉన్న సమయంలో నేను ఇక్కడ బాగానే ఉన్నా మీరు బాగా చదివి మన దళితుల అభ్యున్నతి కోసం కష్టపడండి అని ఉత్తరాలు పంపడం జరిగిందని గుర్తు చేశారు. అదే సమయంలో తన నలుగురు సంతానము మరణించిన వెనకడుగు వేయని వీరనారి రమాబాయి అంబేద్కర్ అని కొనియాడినారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లన్న, రాజు, పాశం రాఘవేంద్ర, వెంకటస్వామి, అర్జున్, చంటి రవి, భూమన్న, నర్సింలు, పోశెట్టి, ప్రభాకర్, చంద్రశేఖర్, గంగన్న తదితరులు పాల్గొన్నారు.