* సభ్యులుగా ప్రియాంక కానుంగో, జస్టిస్ బిద్యుత్ రంజన్ సారంగి
* ఆమోదముద్ర వేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ, డిసెంబర్ 23: జాతీయ మాన వ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) చైర్మన్‌గా జస్టిస్ వీ రామ సుబ్రమణియన్ సోమవారం నియమితులయ్యారు. ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని కమిటీ చేసిన సిఫారసుల మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. ఆయన త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు. జస్టిస్ వీ రామ సుబ్రమణియన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఈ నియామకం అమలులోకి వస్తుంది.
రామ సుబ్రమణియన్ తమిళనాడులోని చైన్నైలో 1958 జూన్ 30న జన్మించారు. మద్రాసు లా కాలేజీలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి 1983లో న్యాయవాదిగా బార్ కౌన్సిలో పేరు నమోదు చేసుక్నురు. 23 సంవత్సరాలపాటు చైన్నై హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2006లో జూలైలో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తిగా, 2009లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులై 2016 ఏప్రిల్ వరకు పనిచేశారు.
2016 ఏప్రిల్ నుంంచి 2019 జూన్ వరకు తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 2019 జూన్ 22నుంచి 2019 సెప్టెంబర్ వరకు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023 జూన్ 30వ తేదీ వరకు కొనసాగారు. కాగా మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏర్పాటైన ఈ కమిషన్‌కు చైర్మన్‌గా సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులను, లేదా ఇతర రిటైర్డ్ జడ్డిలను నియమిస్తారు.