24-04-2025 09:45:40 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో విధుల్లో అలసత్వం వహించిన మరో ఎస్సై పై సస్పెన్షన్ వేటు పడింది. బాధితులకు సంబంధించిన కేసు నమోదుపై నిర్లక్ష్యం వహించిన రామారెడ్డి చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జారీ చేశారు. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. ఫిర్యాదుధారులను ఎస్సై నరేశ్ పట్టించుకోలేదు. ఎఫ్ఎఆర్ నమోదు చేయడంలో ఆలస్యం చేశారు.
కనీసం ప్రాథమిక విచారణ కూడా చేపట్టకపోవడం జిల్లా ఎస్పీ దృష్టికి వచ్చింది. దీంతో కేసును తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణను ముమ్మరం చేసి కేసును పరిష్కరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సై నరేష్పా వెంటనే ఐజీకి నివేదిక పంపడంతో సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేకపోతే చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర హెచ్చరించారు.