21-02-2025 12:00:00 AM
చేవెళ్ల, ఫిబ్రవరి 20: వ్యవస్థలపై నమ్మకం లేకే రామరాజ్యం ఏర్పాటు చేసి నట్లు చిలుకూరు బాలాజీ అర్చకుడు రంగ రాజన్ పై దాడి చేసి వీర రాఘవరెడ్డి వెల్ల డించారు. కోర్టు అనుమతితో మూడు రోజుల కస్టడీకి తీసుకున్న మొయినాబాద్ పోలీసులు సీఐ పవన్ కుమార్ రెడ్డి ఆధ్వ ర్యంలో మంగళవారం నుంచి గురువారం వరకు విచారణ చేశారు.
రంగరాజన్‌పై దాడికి గల కారణాలు, రామరాజ్యం లక్ష్యం, ఇప్పటి వరకు అతను వెళ్లిన ఆలయాలు... తదితర అంశాలపై వివరాలు సేకరించారు. 2014-15 విద్యా సంవత్సరంలో తన బిడ్డ రెండో తరగతి చదువుతున్నప్పుడు పాఠశాల యాజమాన్యం పైతరగతులకు ప్రమోట్ చేయకుండా డీటెయిన్ చేసిందని, జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాడు చేసినా స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకో లేదని తెలిపారు.
హైకోర్టుకు వెళ్లినా న్యాయం జరగలేదని వాపోయాడు. అంతే కాదు 14 ఏండ్లలోపు పిల్లలను డిటెయిన్ చేయొద్దని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశానని చెప్పాడు.. అక్కడా న్యాయం జగకపోవడంతో దేశంలోని వ్యవస్థలపై సమ్మకం పోయిందన్నారు. అందుకే ఒక సాధువు చెప్పడంతో వ్యవస్థలను ప్రశ్నిం చేందుకు రామరాజ్యం సంస్థ ఏర్పాటు చేశానని వెల్లడించారు.
ఇందులో సభ్యులను నియమించుకొని ఆలయాల వద్దకు వెళ్లి అర్చకులు మద్దతు కోరుతున్నానని, ఇందు లో భాగంగానే రంగరాజన్ వద్దకు వెళ్లాన న్నారు. అయితే ఆయన అందుకు అంగీ కరించలేదని..
ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో తన సైన్యం ముందు చులకన అవుతానని అతనిపై దాడి చేసినట్లు చెప్పాడు . ఇందుకు తాను చింతిస్తున్నానని, భవిష్యత్లో శాంతియుతంగానే రామ రాజ్యాన్ని నడిపిస్తానని వెల్లడించాడు.
చదివింది పదో తరగతి వరకే
తాను పదో తరగతి వరకే చదివానని పోలీసులకు తెలిపాడు. మత గ్రంథాతో పాటు కొన్ని చట్టాలపై అవగాహన పెంచుకు న్నానని, హిందూ ధర్మాన్ని కాపాడాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నట్లు వివరించాడు. దీంతో నేరాంగీకార వాగ్మూలం నమోదు చేసిన పోలీసులు.. తిరిగి కోర్టుకు తీసుకెళ్లా రు. జడ్జి అనుమతితో మళ్లీ పీఎస్‌కు తీసు కొచ్చి.. రిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.