సైన్స్ ఫిక్షన్, మైథాలాజికల్ థ్రిల్లర్ కలబోతగా రూపొందుతున్న చిత్రం ‘రహస్యం ఇదం జగత్’. ఇందులో రాకేశ్ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపీనాథం తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నవంబర్ 8న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ ట్రైలర్‌ను మంగళవారం దర్శకుడు చందు మొండేటి విడుదల చేశారు. ఈ సందర్భంగా చందు మొండేటి మాట్లాడుతూ ‘ఈ ట్రైలర్ చూసి ఎగ్జుటై అయ్యాను. ఈ సినిమా తీయడం చాలా కష్టం. జనాలు ప్రస్తుతం ఇలాంటి సినిమాలు చూసే మూడ్‌లో ఉన్నారు.
తప్పకుండా ఈ చిత్రం అందర్నీ అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు. దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ మాట్లాడుతూ.. “నాకు నిఖిల్ సిద్ధార్థ్ నటించిన ‘కార్తికేయ’ చిత్రం స్ఫూర్తిని చ్చింది. ఈ సినిమా కేవలం మైథాలజీ కాదు.. రాముడు, హనుమంతుడికేనా..? మనకు కూడా జరుగుతుందా..?! అని ఓ చిన్న పిల్ల వేసే ప్రశ్నకు సమాధానంగా ఉంటుంది” అన్నారు.