calender_icon.png 8 April, 2025 | 3:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగరంగా వైభవంగా రాములోరి కళ్యాణం..

07-04-2025 08:33:32 PM

కల్లూరు (విజయక్రాంతి): మండలంలో పలు గ్రామాలలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఆశేషా భక్తులతో కనుల విందుగా జరిగింది. చిన్న కోరుకోండిలో జరిగిన సీతా రాముని కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ విజయ కుమార్ అయనతో పాటుగా మండలం మార్కెట్ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఏనుగు సత్యం బాబు, ఆళ్లకుంట నరసింహారావు, మట్టా రామకృష్ణ, ప్రముఖ నాయకులు పాల్గొన్నారు. ఖాన్ పేటలో నిర్వహించిన అన్న ప్రసాద కార్యక్రమంలో పాల్గొన్న ఫింగర్ ప్రింట్ సిఐ, ఎస్సై డి.హరిత పేరువంచ గ్రామంలో సుమారుగా 60-70 సంవత్సరాల పురాతన రామచంద్ర స్వామి ఆలయంలో ఘనంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం అత్యంత రామణీయంగా నిర్వహించిన పాత రామాలయ కమిటీవారు మాజీ సర్పంచ్ అంకిరెడ్డి అనూష వెంకట రెడ్డి, కృష్ణా రెడ్డి, ఉపెందర్ రెడ్డి, నాగిరెడ్డి, రాఘవ రెడ్డి, వంశీ కృష్ణ రెడ్డి, వికాస్ రెడ్డి తదితరులు నిర్వహించడం జరిగింది. 

పేరువంచ గ్రామ పంచాయితీలో నూతన రామాలయంలో నిర్వహించిన స్వామి వారి కల్యాణ కామనీయంగా అంగరంగా వైభవంగా నిర్వహించిన రామాలయ కమిటీ, ఈ కార్యక్రమంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అభిజిత్ సుముహుర్తమున శ్రీ సీతారాముల కళ్యాణోత్స వం అంగరంగ వైభవంగా కొనసాగింది అశేష భక్త జనులతో పేరువంచ రామనామ స్మరణతో మారుమోగింది. ఈ కార్యక్రమంలో నూతన రామాలయం కమిటీ వారు, వెంకటేశ్వరరావు, కిసర మధుసూదన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, రంగా రెడ్డి, బుజ్జి రెడ్డి, కృష్ణ రెడ్డి, వెంకటేశ్వరరావు, జోనబోయిన గోపాల్, సతీష్ కుమార్, కిరణ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.