calender_icon.png 9 April, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పొన్నారంలో కమనీయంగా రాములోరి కళ్యాణం

06-04-2025 08:48:43 PM

మందమర్రి (విజయక్రాంతి): శ్రీ సీతారామ చంద్ర స్వాముల కల్యాణ మహోత్సవాన్ని మండలంలోని పొన్నారం గ్రామపంచాయతీలోని భక్తాంజనేయ స్వామి ఆలయంలో కన్నుల పండుగగా నిర్వహించారు. కళ్యాణాన్ని తొలగించేందుకు గ్రామస్తులు హనుమాన్ భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా చైత్ర శుద్ధ నవమి రోజున అభిజిత్ లగ్న సుముహూర్తమున వేద మంత్రాల సాక్షిగా సీతారాముల కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కళ్యాణ మహోత్సవానికి గ్రామస్తులు హనుమాన్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించి భక్తి పరవశ్యంతో పులకించారు.