06-04-2025 05:14:13 PM
బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలోని కన్నాల శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఆదివారం రాములోరి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. బెల్లంపల్లి మండల సీనియర్ నాయకులు, టీపీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నాతరిస్వామి దంపతులు, మాజీ దేవాలయ చైర్మన్, బుగ్గ అన్నదాన ట్రస్ట్ చైర్మన్ మాస్ ఆడి శ్రీదేవి దంపతుల ఆధ్వర్యంలో అర్చకులు సతీష్ శర్మ వేదమంత్రోచ్ఛరణల మధ్య కళ్యాణ మహోత్సవ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు హనుమాన్ భక్తులు,మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణ మహోత్సవం అనంతరం బుగ్గ దేవాలయంలో భక్తులకు నాతరి స్వామి దంపతుల ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో కన్నాల మాజీ సర్పంచ్ జిల్లెపల్లి స్వరూప, నాయకులు మాసాడి శ్రీరాములు, అన్నదాన ట్రస్ట్ సభ్యులు రాజేశం, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.