calender_icon.png 31 October, 2024 | 12:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామసేతు నిజమే!

16-07-2024 02:28:27 AM

  • సముద్ర గర్భంలో 28 కిలోమీటర్ల మేర బ్రిడ్జి 
  • 2 లక్షల చిత్రాలను అధ్యయనం చేసి ప్రకటించిన ‘ఇస్రో’

బెంగళూరు, జూలై 15: తమిళనాడులోని ధనుస్కోడి నుంచి హిందూ మహా సముద్రంలో శ్రీలంకలోని మన్నార్ ద్వీపం వరకు సముద్ర గర్భంలో 7 నుంచి 8 మీటర్ల ఎత్తులో 28 కిలోమీటర్ల మేర 1.5 వెడల్పుతో రామసేతు (ఆడమ్స్ బ్రిడ్జి) భౌతికంగా ఉన్నది నిజమేనని తాజాగా ఇండియన్ స్పేస్ రిసెర్చి ఆర్గనేజేషన్ (ఇస్రో) ప్రకటించింది. ‘నాసా’కు చెందిన ఐసీఈ శాట్  ఉపగ్రహం నుంచి సుమారు ఇస్రో జోధ్‌పూర్ వింగ్ శాస్త్రవేత్తలు, హైదరాబాద్‌కు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నిపుణు లు ఆరు సంవత్సరాల పాటు నమోదైన డాటా సేకరించారు.

అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో ఐసీఈ శాట్  ఉపగ్రహ ం చిత్రీకరించిన సుమారు 2 లక్షల రామసేతు చిత్రాలపై అధ్యయనం చేసి పలు కీలక అంశాలను గుర్తించారు. ప్రస్తుతం రామసేతు 98.98శాతం నీట మునిగిందని తేల్చారు. ఉపగ్రహానికి చెందిన లేజర్ లెన్స్‌లు సముద్ర గర్భంలో 40 మీటర్ల మేర చొచ్చుకుపోయి రామసేతు అడుగు భాగంలోని చిత్రాలనూ చిత్రీకరించాయని తెలిపారు. తొమ్మిదో శతా బ్దం వరకు ఈ బ్రిడ్జిని ‘సేతుబంధై’ అని పిలిచేవారు. ధార్మిక సంస్థలు, భక్తజనం ప్రస్తుతం ఆ బ్రిడ్జిని ‘రామసేతు’గా పిలుస్తున్నారు. మత విశ్వాసాల ప్రకారం సామాన్య జనం బ్రిడ్జిని ‘రామసేతు’ అని పిలవడానికే ఇష్టపడుతున్నారు.