calender_icon.png 29 March, 2025 | 5:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సలాబత్ పూర్ హనుమాన్ టెంపుల్ చైర్మన్ గా రామ్ పటేల్

24-03-2025 05:42:33 PM

మద్నూర్ (విజయక్రాంతి): ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రఖ్యాత గాంచిన మూడు రాష్ట్రాల సరిహద్దులో గల మద్నూర్ మండలంలోని సలాబత్పూర్ మారుతి మందిర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పాలక మండలి నూతన కమిటీని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఎంపిక చేసింది. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయ కమిటీ చైర్మన్గా పెద్ద షక్క ఆర్గా గ్రామానికి చెందిన రామ్ పటేల్ ఎంపిక అయ్యారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ నూతన పాలకమండలి కమిటీ సభ్యులుగా ఉష్కల్వర్ శ్రీనివాస్, తోట వార్ నాగనాథ్, ఇంగులే కుశాల్ రావు, పటేల్ పండరి, కాకాని కైలాష్ సత్యనారాయణ, లక్ష్మీబాయిలను నియమించారు.