06-04-2025 11:36:10 PM
దాడి జరిగిందన్న బీజేపీ..
లేదన్న పోలీసులు..
పలు వాహనాలు ధ్వంసం..
కోల్‌కతా: కోల్‌కతా నిర్వహించిన శ్రీరామనవమి శోభాయాత్రలో హిందువులపై దాడి జరిగిందని బీజేపీ ఆరోపించింది. టీఎంసీ ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇటువంటి దాడులు జరిగాయని బీజేపీ ఆరోపించింది. అయితే అటువంటి దాడేం జరగలేదని పోలీసులు ప్రకటించారు. కేంద్ర మంత్రి సుకాంత మజూందార్ హిందువులపై దాడి జరిగిందని ఆరోపించారు. ‘కాషాయ జెండాలతో ర్యాలీలో పాల్గొన్న పలు వాహనాలపై రాళ్లు విసిరారు. తీవ్ర గందరగోళం చెలరేగింది. ఇది కావాలని చేసిన హింస. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎక్కడున్నారు. చలనం లేకుండా చూస్తూనే ఉంటారా’ అని విమర్శిస్తూ ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పనిలో పనిగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఆరోపణలు ఎక్కుపెట్టారు. దాడి జరిగిందని ఆరోపిస్తూ పశ్చిమబెంగాల్ బీజేపీ ఓ వీడియోను కూడా షేర్ చేసింది. అయితే ఆ ఏరియాలో ఎటువంటి యాత్ర జరగలేదని, అసలు యాత్ర చేసేందుకు అనుమతే లేదని తెలిపారు. ప్రజలు రూమర్స్ నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.