బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ క్రీడా మైదానంలో విజయదశమి సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో రామ్ లీలా విగ్రహ ఏర్పాట్లు జరుగుతున్నాయి. వారం రోజులుగా మైదానంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు కంటే వాడ నగేష్, మద్దెర్ల శ్రీనివాస్, కోడి రమేష్, సూరం లక్ష్మీనారాయణ, కాసర్ల తిరుపతిల పర్యవేక్షణలో 70 అడుగుల ఎత్తులో ఆకర్షణీయ రంగులతో విగ్రహ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. విజయదశమి రోజైన శనివారం సాయంత్రం వరకు తిలక్ క్రీడా మైదానంలో ప్రజలు రామ్ లీలా కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.