calender_icon.png 24 January, 2025 | 4:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ్‌గోపాల్ వర్మకు 3 నెలల జైలుశిక్ష

24-01-2025 01:21:57 AM

చెక్‌బౌన్స్ కేసులో అంధేరి కోర్టు తీర్పు

ముంబై, జనవరి 23: ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు చెక్‌బౌన్స్ కేసులో గురువారం ముంబైలోని అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు మూడు నెలల జైలుశిక్ష విధించింది. విచారణకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అలాగే పిటిషనర్‌కు మూడు నెలల్లో రూ.3.72 లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

2018లో రామ్‌గోపాల్ వర్మపై మహేశ్ చంద్ర మిశ్రా అనే వ్యక్తి ‘శ్రీ కంపెనీ’ పేరుతో రూ.2.38 లక్షలకు చెక్ బౌన్స్ కేసు పెట్టాడు. ఈ కేసులో వర్మ 2022లో రూ.5 వేల పూచీకత్తుతో బెయిల్ పొందారు. తర్వాత వర్మ కోర్టు విచారణకు హాజరు కావడం లేదు. దీంతో విచారణకు హాజరుకావాలని కోర్టు నోటీసులు జారీ చేసినప్పటికీ, ఆయన విచారణకు హాజరుకాలేదు.

దీంతో కోర్టు బీఎన్‌ఎస్ సెక్షన్  ప్రకారం వర్మ ను దోషిగా తేల్చి జైలు శిక్ష విధించింది. వర్మ ఒకవేళ ౩ నెలల్లో పిటిషనర్ రూ.3.72 లక్షలు చెల్లించకపోతే, వర్మ అదనంగా మరో మూడునెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పునిచ్చింది. 

‘ఎక్స్’ ద్వారా వర్మ స్పందన..

చెక్‌బౌన్స్ కేసులో అంధేరి కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత రామ్‌గోపాల్ వర్మ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘ఇది ఏడేళ్ల క్రితం కేసు. నా వద్ద పనిచేసిన ఓ మాజీ ఉద్యోగి రూ.2.38 లక్షల వివాదానికి సంబంధించినది. మా న్యాయవాదులు ఆ వ్యవహా రాన్ని చైసుకుంటున్నారు. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున నేను ప్రస్తుతా నికి ఇంతకంటే ఎక్కువగా ఏం చెప్పలేను’ అని రాసుకొచ్చారు.