తానెక్కడికీ పారిపోలేదంటూ వీడియో పోస్ట్
- కొనసాగుతున్న ఏపీ పోలీసుల గాలింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 27 (విజయక్రాంతి): వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ కోసం ఏపీ పోలీసులు ఇప్పటికీ గాలింపు చర్యలు చేపడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆయనపై తెలుగు రాష్ట్రాల్లో మొత్తం తొమ్మిది కేసులు నమోదయ్యాయి. ఆయన విచారణకు రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లడంతో పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కాగా.. మరోవైపు రామ్‌గోపాల్‌వర్మ సోషల్‌మీడియాలో ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
‘నేనెవరికీ భయపడటం లేదు. నేను ఎవరిపైనేతే పోస్టులు పెట్టానో, వారి మనోభావాలు కాకుండా, వేరే వ్యక్తుల మనోభావాలు ఎలా దెబ్బతింటాయి? ఈ కేసులు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయి’ అని ఆయన ప్రశ్నించారు. సంవత్సరం క్రితం పోస్టులపై ఇప్పుడు అంత హడావిడి ఎందుకో అర్థం కావడం లేదన్నారు. తన కోసం పోలీసులు పరుగులు పెట్టడం వెనక ఎవరున్నారో అందరికీ స్పష్టంగా అర్థమవుతుందన్నారు.
తాను ప్రస్తుతం ఓ మూవీ షూటింగ్‌లో ఉన్నానని, నిర్మాతకు నష్టం వస్తుం దనే ఉద్దేశంతోనే విచారణకు రాలేకపోతున్నట్లు స్పష్టం చేశా రు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్ సమయంలో.. నాటి ప్రతి పక్ష నేత చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులతో పాటు జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వ్యక్తిత్వాలను కించపరిచేలా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ కార్యదర్శి ఎం.రామలింగం ఫిర్యాదు చేసిన నేపథ్యం లో ఈ కేసు వేగవంతమైన సంగతి తెలిసిందే.