calender_icon.png 4 April, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ భక్తుల ట్రాక్టర్ బోల్తా.. తెగిపడిన మహిళా పాదం

03-04-2025 03:00:13 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి): భద్రాచలం(Bhadrachalam) శ్రీరామ నవమికి  ఆంధ్రా నుండి నడిచి వెళుతున్న రామ భక్తులు  కొందరు ట్రాక్టర్ లో ప్రయాణిస్తూ ఉండగా  అశ్వారావుపేట మండలం గాడ్రల సమీపం లోని శివాలయం వద్ద గురువారం ట్రాక్టర్ బోల్తా పడి ఒక మహిళ పాదం తెగిపడగా, ఇతరులకు తీవ్రగాయాలు అయ్యాయి.   పచ్చిమ గోదావరి జిల్లా చాగల్లు మండలం దారారం  గ్రామానికి చెందిన కూచిపూడి మంజు అనే మహిళ  కాలు తెగి పడింది. మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. క్షత గాత్రులను 108 లో అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తెగి పడిన కాలు నీ సంచి లో పెట్టీ తెచ్చారు.ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమండ్రి తరలించారు.