calender_icon.png 8 January, 2025 | 10:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ్‌చరణ్ విశ్వరూపం చూస్తారు!

30-12-2024 03:37:59 AM

256 అడుగుల కటౌట్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత దిల్ రాజు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ క్రమంలో ఆదివారం ఆర్‌సీ యువశక్తి ఆధ్వర్యంలో విజయవాడలో రామ్‌చరణ్ భారీ కటౌట్‌ను ఆవిష్కరించారు.

256 అడుగుల ఎత్తయిన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్ కు దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘ఇప్పుడు ట్రైలర్‌లే సినిమా స్థాయిని నిర్ణయిస్తున్నాయి. అందుకే ఈ సినిమా ట్రైలర్‌ను కొత్త ఏడాది సందర్భంగా అంటే జనవరి 1న మీ ముందుకు తీసుకు వస్తున్నాం.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ చేయాలనుకుంటున్నాం. ఆ విషయం మాట్లాడేందుకే వచ్చాను. ఆయన ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5 ఏపీలో ఈవెంట్ ఉంటుంది.  చిరంజీవి సినిమా చూశారు. ‘ఈ సంక్రాంతికి మామూలుగా కొట్టడం లేదు’ అని ఫ్యాన్స్‌కు చెప్పండని అన్నారు.

చాలా సంతోషంగా అనిపించింది. జనవరి 10న మీరు రామ్ చరణ్ నట విశ్వరూపాన్ని చూడబోతోన్నారు. 2 గంటల 45 నిమిషాలే ఉండాలంటే.. అంతే ఆయన అద్భుతంగా కట్ చేసి ఇచ్చారు. ఎస్‌జే సూర్య, రామ్‌చరణ్ సీన్లతో థియేటర్లు దద్దరిల్లుతాయి. సంక్రాంతిని గట్టిగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి’ అని అన్నారు.