‘గేమ్ చేంజర్’ డల్లాస్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సుకుమార్
టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, దర్శకుడు ఎస్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘గేమ్‌చేంజర్’. ఈ సినిమాను శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 10న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.
ఇందులో భాగంగా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఛరిష్మా డ్రీమ్స్ రాజేశ్ కల్లెపల్లి ఆధ్వర్యంలో డల్లాస్‌లో శనివారం రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “శంకర్ గారితో ఈ సినిమా చేస్తున్న విషయాన్ని రామ్‌చరణ్ మొదటగా నాకే చెప్పినట్టున్నాడు. చిరంజీవి గారితో కలిసే ఈ చూశా.
ఫస్ట్ హాఫ్ అద్భుతం.. ఇంటర్వెల్ బ్లాక్‌బస్టర్.. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్‌బంప్స్, ఫినామి నల్.. ‘జెంటిల్‌మెన్’, ‘భారతీయుడు’ ఎంత ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ చేశాను. ‘రంగస్థలం’ తర్వాత రామ్‌చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందనుకు న్నా. రాలేదు. ‘గేమ్‌చేంజర్’ క్ల్లుమాక్స్‌లో రామ్‌చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుంది” అని అన్నారు.
హీరో రామ్‌చరణ్ మాట్లాడుతూ.. ‘శంకర్ గారు కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ గారు అలా.. డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ గారితో పనిచేయడం నా అదృష్టం’ అన్నారు. డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ.. ‘పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్‌టైనర్ చేయాలని అనుకున్నా. అందులోనూ నా మార్క్ ఉండాలనుకున్నా.
అదే ‘గేమ్ చేంజర్” అన్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మాట్లాడుతూ.. ‘మా బ్యానర్‌లో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. కరోనా వల్ల కాస్త ఆలస్యం అయింది. రామ్‌చరణ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. నేను చిరంజీవి గారి చిత్రాలను ఆడియెన్‌గా చూసి ఎంజాయ్ చేశా. కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి నాకు చాలా టైమ్ పట్టింది.
మెగా ఫ్యామిలీతో ఉన్న బాండింగ్‌తో ‘ఎవడు’ చేశాం. అది రిలీజై 11 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు ‘గేమ్ చేంజర్’తో మళ్లీ సంక్రాంతికి రాబోతోంది. ఈ సారి గట్టిగా కొట్టబోతోన్నాం. ఓ తెలుగు సినిమాకు ఇలా మొదటి సారిగా ఇక్కడ ఈవెంట్ నిర్వహించి గేమ్‌చేంజర్‌తో.. గేమ్‌చేంజ్ చేశాం. సుకుమార్‌ను నేను పరిచయం చేయలేదు. మా ఇద్దరి జర్నీ ఒకేసారి ప్రారంభం అయింది.
‘గేమ్‌చేంజర్’తోపాటు ‘సంక్రాంతికి వస్తున్నాం’ తీసుకురమ్మని చిరంజీవి గారు, రామ్‌చరణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ చిత్రం కూడా రాబోతోంది. పండుగకు రాబోతోన్న అన్ని చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలి’ అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎస్‌ఎస్ తమన్, చరిష్మా డ్రీమ్స్ రాజేశ్ కల్లెపల్లి, డైరెక్టర్ బుచ్చిబాబు సానా, నిర్మాత అనిల్ సుంకర, యాక్టర్ ఎస్‌జే సూర్య, హీరోయిన్ అంజలి తదితరులు మాట్లాడి తమ అనుభవాలు, అభిప్రాయాలను పంచుకున్నారు.