calender_icon.png 1 January, 2025 | 3:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్.. ఎంతో తెలుసా..?

29-12-2024 07:00:55 PM

విజయవాడ: విజయవాడ బృందావన కాలనీలో టాలివుడ్ మెగా హీరో రామ్ చరణ్(Ram Charan) భారీ కటౌట్ వరల్డ్ రికార్డు సాధించింది. రాష్ట్ర రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో గేమ్ ఛేంజర్ సినిమా కోసం ఏర్పాటు చేసిన 256 భారీ కటౌట్ ను గేమ్ ఛేంజర్(Game Changer) చిత్ర బృందం ఆవిష్కరించింది. ఈ భారీ కటౌట్‌ దేశంలోనే అతి పెద్దదని మెగా అభిమానులు చెబుతున్నారు. కాగా, ప్రభాస్ పేరిట ఉన్నా 230 అడుగుల కటౌట్ రికార్డును రామ్ చరణ్ కటౌట్ దాటేసినట్లు తెలుస్తొంది. దీంతో రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు(Wonder Book Of Records) సాధించింది.

నిర్మాత దిల్ రాజు(Producer Dil Raju) రికార్డు సంస్ధ ప్రతినిధుల నుంచి అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుతో మెగా ఫ్యామిలీకి మరో అరుదైన గౌరవం దక్కింది. రామ్ చరణ్ హీరోగా చేసిన గేమ్ ఛేంజర్ మూవీ జనవరి 10న సంక్రాంతి కనుకగా విడుదల చేయనున్నారు. ఈ కటౌట్ ఆవిష్కరణలో హీరో రామ్ చరణ్ అభిమానులు భారీగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.