calender_icon.png 10 January, 2025 | 7:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామ్‌చరణ్ ఏ సీన్ అయినా అందంగా హ్యాండిల్ చేస్తారు

20-12-2024 12:00:00 AM

రామ్‌చరణ్, దర్శకుడు ఎస్ శంకర్ కాంబోలో తెరకెక్కుతున్న ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్‌చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను మీడియాతో పంచుకున్నారు. “ఆర్‌ఆర్‌ఆర్’ రిలీజ్‌కు ముందే ఈ సినిమా చేయాలని రామ్‌చరణ్ నిర్ణయిం చుకున్నారు.

దిల్ రాజు కూడా రామ్‌చరణ్‌నే తీసుకుంటే బాగుంటుందని భావించారు. రామ్‌చరణ్‌ను చూస్తే.. లోలోపల ఏదో తెలియని శక్తిని కంట్రోల్ చేసి పెట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. టైమ్, సందర్భంగా వచ్చినప్పుడు ఆ శక్తి విస్ఫోటనం చెందుతుందా? అన్నట్టుగా ఉంటుంది. డీప్ పెర్ఫార్మెన్స్, మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్న రామ్‌చరణ్ ఎలాంటి సీన్ అయి నా అద్భుతంగా, అందంగా హ్యాండిల్ చేస్తారు” అని తెలిపారు. అవినీతి రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేసే ఐఏఎస్ అధికారిగా రామ్‌చరణ్ ఈ సినిమాలో కనిపించున్నారు. ఇందులో ఇంకా ఎస్‌జే సూర్య, సముద్రఖని, అంజలి, నవీన్‌చంద్ర, సునీల్, శ్రీకాంత్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.