27-04-2025 10:40:13 PM
కోదాడ: కులమతాలకతీతంగా 140 కోట్ల మంది భారతీయులు ఏకతాటిపై నిలబడి పాకిస్తాన్ ఉగ్రవాద కిరాతక చర్యలను ఖండించాలని పలువురు ఆర్యవైశ్య సంఘ నాయకులు పిలుపునిచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని నిరసిస్తూ పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అనుబంధ సంఘాలైన వాసవి క్లబ్స్ అవోపా సభ్యులతో ఆదివారం సాయంత్రం పట్టణంలోని ప్రధాన రహదారిపై భారీ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా థియేటర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు సంఘ నాయకులు మాట్లాడుతూ... భారతదేశంపై కుట్రపూరిత దాడులు నిర్వహించినంత మాత్రాన భారత్ బెదిరేది లేదని, ఉగ్రవాద చర్యలను, కుట్రలను దిప్పిగొడతామన్నారు.
భారత్ పై నిర్వహించే కుట్రపూరిత దాడులతో తానే నష్టపోతుంది తప్ప దాయాది దేశం సాధించేదేమీ లేదన్నారు. భారతీయులందరూ కుల మతాలకు అతీతంగా భారత్ పై జరిగే కుట్రలను ఖండించాలన్నారు. భారతదేశ రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం అనుసరించే ఏ విధానానికైనా పార్టీలతో సంబంధం లేకుండా తాము మద్దతిస్తామన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్ష కార్యదర్శులు పైడిమర్రి నారాయణరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు, పట్టణ సంఘం ప్రధాన కార్యదర్శి పందిరి సత్యనారాయణ, సంఘ నాయకులు పైడిమరి సత్యబాబు, ఓరుగంటి ప్రభాకర్, గారిని శ్రీధర్, పైడిమర్రి వెంకటనారాయణ, చలా ప్రకాష్ రావు, ఇరుకుల్ల చెన్న కేశవరావు ఇమ్మడి రమేష్, యాద సుధాకర్, రాయపూడి వెంకటనారాయణ, ఓరుగంటి కిట్టు, యాద రమేష్, వంగవీటి శ్రీనివాసరావు, జనార్ధన్, బెలిదే భరత్, ఇమ్మడి అనంత చక్రవర్తి, వంగవీటి భరత్ చంద్ర, వాసవి క్లబ్ బాధ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.