calender_icon.png 16 March, 2025 | 8:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణలో ప్రజాస్వామ్యం ఖుని

15-03-2025 10:21:07 PM

జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ కు నిరసనగా ర్యాలీ 

జ‌హీరాబాద్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన బీఆర్ ఎస్ నాయ‌కులు 

జహీరాబాద్: అసెంబ్లీ సమావేశాల నుంచి సూర్యాపేట ఎమ్మెల్యే ,మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని శాస‌న స‌భ స‌మావేశాల‌ను నుంచి  సస్పెన్ష‌న్  చేయడం ప్రజాస్వామ్యంను ఖుని చేస్తున్నార‌ని  బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. శనివారం  బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు జహీరాబాద్ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టి రోడ్డుపై బైఠాయించారు. అసెంబ్లీలో ప్రశ్నిస్తారని ఉద్దేశంతో జగదీశ్వర్ రెడ్డి సస్పెన్షన్ చేశార‌ని  ఆరోపించారు.  ఎన్నికలో ఇచ్చిన  ఆరు గ్యారెంటీలు ప్రజల ముందు పెట్టి ప్రస్తుతం నెరవేర్చక పోగా ఆరు గ్యారెంటీలను బీ ఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తుందని అందుకు ఒక్కొక్కరిని సస్పెండ్ చేయాలని ఉద్దేశంతో  జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేశారని ఆరోపించారు.  ఈ కార్యక్రమంలో మగడంపల్లి టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంజీవరెడ్డి పార్టీ నాయకులు, న‌ర్సిములు , వెంక‌టేశం,   నామ రవి కిరణ్ బండి మోహన్ భాస్కర్ యాకూబ్ నరసింహ గౌడ్ అబ్దుల్లా మంజుల అనుషమ్మ రాకేష్ మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.