calender_icon.png 27 April, 2025 | 9:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉగ్ర దాడికి నిరసనగా కిష్టాపూర్ వార్డులో ర్యాలీ

27-04-2025 12:03:57 AM

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 26 (విజయక్రాంతి) :జమ్మూ కశ్మీర్‌లో కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్న పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి 28 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్న తీవ్రవాదుల దుశ్చర్యను నిరసిస్తూ మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని కిష్టాపూర్ 4వ వార్డ్ లో  శనివారం పలువురు నాయకులు స్థానికులు కలిసి, సాయంత్రం కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులు మాట్లాడుతూ పహల్గాంలోని బైసరన్ ప్రాంతంలో ముష్కరుల ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి  దేశ పౌరులందరూ నివాళులు అర్పి స్తూ మృతి చెందిన వారి కుటుంబాలకు  బాసటగా నిలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఇంతటి దారుణానికి పాల్పడిన కిరాతకులను పట్టుకుని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. పహల్గాం దాడికి పాల్పడిన వారిని పట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు. ఉగ్రవాద సంస్థలను ప్రభు త్వం గుర్తించి అంతమొందించాలని విజ్ఞప్తి చేశా రు. దేశ ప్రజలందరం ఐకమత్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. మేడ్చల్ మున్సిపాలిటీ బిజెపి పార్టీ అధ్యక్షురాలు జెకె శైలజ హరినాథ్, మాట్లాడుతూ దారుణమైన నేరాలకు పాల్పడుతున్న ముష్కరులు దేశానికి శత్రువులన్నారు.

ఈ దుఃఖ సమయంలో ఉగ్రవాద, ఛాందసవాద శక్తులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ కాశ్మీర్ ప్రజలకు బాసటగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో, బిజెపి పార్టీ అధ్యక్షురాలు శైలజ హరినాథ్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు పరశురాం, బిజెపి నాయకులు శ్రీనివాస్ గౌడ్, అర్చన కాలనీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, కిష్టాపూర్ అధ్యక్షుడు అర్జున్, రామ్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, భాస్కర్, సత్యనారాయణ చారి ,స్వామి, తగ్గురాజు, రాజిరెడ్డి, మంత్రి కుమార్ మధుసూదన్ రెడ్డి, అక్బర్ రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు