calender_icon.png 3 October, 2024 | 10:57 PM

నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు.. : రకుల్ ప్రీత్ సింగ్

03-10-2024 08:33:21 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఒక్కోక్కరుగా స్పందిస్తున్నారు. తాజాగా నటి రకుల్ ప్రీత్ సింగ్ రియక్ట్ అయ్యారు. నటి సమంత, నాగార్జున కుటుంబంతో పాటు రకుల్ ప్రీత్ సింగ్ పేరును కూడా కొండా సురేఖ ప్రస్తావించారు. మీ రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరు వాడొద్దని, మీరు వార్తల్లో నిలిచేందుకు కల్పిత కథనాలను సృష్టించవద్దంటూ రకుల్ కోరారు. తను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు.. తను పూర్తిగి రాజకీయ వ్యతిరేకిని, ఒక మహిళ గురించి నిరాధార ఆరోపణలు చేయడం, ఒక మహిళ గురించి మరో మహిళే అలా మట్లాడటం బాధించిందని పేర్కొన్నారు.

బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మహిళ మంత్రి అలా మాట్లాడటం సరికాదని రకుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హుందాగా ఉండాలనే ఉద్దేశంతోనే తామంతా నిశ్శబ్ధంగా ఉన్నాం.. నిశ్శబ్దంగా ఉండటం మా బలహీనత అనుకోవద్దు అంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఆరోపించారు. తెలుగు సినీ పరిశ్రమ దాని సృజనాత్మక, వృత్తి నైపుణ్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిందన్నారు.  నటులు, సృజనాత్మక వ్యక్తులను రాజకీలకు దూరంగా పెట్టండి. వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టావద్దని రకుల్ ప్రీత్ సింగ్ పేర్కొన్నారు.

మంత్రి కొండా సురేఖ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యాలు చేసిన విషయం తెలిసిందే. సినీనటి సమంత నాగచైతన్య విడాకులు, రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి, అక్కినేని నాగార్జున కుటుంబం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను లేవనెత్తుతూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యాలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో #FilmIndustryWillNotTolerate అనే హ్యాష్ ట్యాగ్ తో మంత్రి కొండా సురేఖపై నటీనటులు భారీగా విరుచుకుపడుతున్నారు.