calender_icon.png 1 November, 2024 | 3:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రగ్స్ కేసులో హీరోయిన్ రకుల్‌ ప్రీత్ సింగ్ తమ్ముడు అరెస్ట్

15-07-2024 04:47:26 PM

హైదరాబాద్: నటి రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. అమన్‌ప్రీత్‌ సింగ్‌ నుంచి పోలీసులు డ్రగ్స్‌ స్వాధీనం చేసుకున్నారు. మీడియా కథనాల ప్రకారం, హైదరాబాద్ పోలీసులు నగర శివార్లలోని రాజేంద్ర నగర్ వద్ద డ్రగ్స్ రాకెట్‌ను ఛేదించారు. రాజేంద్ర నగర్ పోలీసులు,SOT (స్పెషల్ ఆపరేషన్ టీమ్) సంయుక్త ఆపరేషన్‌లో 200 గ్రాముల కొకైన్ (నిషేధించబడిన పదార్థం) స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందని అంచనా.

నివేదికల ప్రకారం,  అమన్‌ప్రీత్‌ సింగ్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు అరెస్ట్‌ అయ్యారు. వీరితో పాటు ఐదురుగు నైజీరియన్లు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఐదురుగు నైజీరియన్లు డ్రగ్స్‌ రవాణా, విక్రయాల్లో పాలుపంచుకుంటున్నారని పోలీసులు గుర్తించారు. పక్కా సమాచారం మేరకు ఎస్‌ఓటీ అధికారులు, పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రకుల్ ప్రీత్ సోదరుడు అమన్ ప్రీత్ డ్రగ్స్ కొనుగోలులో పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. గతంలో రకుల్ ప్రీత్‌పై డ్రగ్స్‌ తీసుకున్నట్లు ఆరోపణ వచ్చాయి.