calender_icon.png 24 December, 2024 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిమ్‌లో గాయపడిన రకుల్

17-10-2024 12:00:00 AM

రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకుని ప్రస్తుతం ముంబైలో సెటిల్ అయింది. బిజినెస్ పనులుంటేనే హైదరాబాద్ వచ్చి పోతోంది. ఇక దక్షిణాదిన సినిమాలు అసలు చేయడమే లేదు. ఆమెకు అవకాశాలు రావడం లేదో.. లేదంటే ఆమే వద్దనుకుందో కానీ సౌత్‌కు పూర్తిగా దూరమైంది. హిందీ అవకాశాలు ఒకటీ అర దక్కించుకుంటోంది. నిర్మాత, నటుడు జాకీ భగ్నానీని ఈ ఏడాది గోవాలో వివాహం చేసుకున్న రకుల్.. సినిమాలతోపాటు బిజినెస్ కూడా చేసుకుంటూ బిజీగా గడిపేస్తోంది.

ఉన్న జిమ్ బిజినెస్‌కు తోడు గత ఏడాది ఫుడ్ బిజినెస్‌లోకి కూడా రకుల్ ఎంటరైంది. ఇక తాజాగా రకుల్ జిమ్‌లో బరువులు ఎత్తుతూ గాయపడిందని సమాచారం. ఆమె నడుము భాగానికి దెబ్బ తగిలినట్టు తెలుస్తోంది. కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారట. దీంతో రకుల్ ప్రస్తుతం చేస్తున్న ప్రాజెక్టులకు బ్రేక్ ఇచ్చి విశ్రాంతి తీసుకుంటోందట. ప్రస్తుతం రకుల్  బాలీవుడ్ చిత్రం ‘దే దే ప్యార్ దే 2’లో నటిస్తోంది.