calender_icon.png 8 January, 2025 | 12:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసేపట్లో 'కాటమయ్య రక్ష' కిట్లను అందజేయనున్న సీఎం రేవంత్‌రెడ్డి

14-07-2024 12:32:53 PM

హైదరాబాద్: కల్లుగీత కార్మికుల కోసం రేవంత్ సర్కార్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.నేడు గీతకార్మికులకు కాటమయ్య రక్ష కిట్ల పంపిణీ పథకం ఆదివారం ప్రారంభం కానుంది. కాసేపట్లో అబ్దుల్లాపూర్ మెట్ మండలం లష్కర్ గూడ తాటివనంలో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా గీతకార్మికులకు రక్షణ కిట్లు పంపిణీ చేయనున్నారు. తాటి, ఈత చెట్లు ఎక్కుతుండగా ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షణ కవచం పేరుతో సేఫ్టీ కిట్లను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఆరు పరికరాలతో కూడిన కాటమయ్య రక్షణ కిట్ ను ఆధునిక టెక్నాలజీతో హైదరాబాద్ ఐఐటీ తయారు చేసింది.