calender_icon.png 11 January, 2025 | 3:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నా చెల్లెళ్ల అనుబంధం రక్షా బంధన్

19-08-2024 12:00:00 AM

అన్న అంటేనే కొండత అండ. తల్లిదండ్రుల తర్వాత ప్రేమను పంచేది అన్న మాత్రమే. ఏ కష్టమొచ్చినా నేనున్నా అంటూ ముందుకొచ్చేది కూడా అన్ననే. కొట్టుకున్నా, తిట్టుకున్నా మరుక్షణంలో కలిసిపోవడం కేవలం అన్నాచెల్లెళ్ల బంధానికే చెల్లుతుంది. అందుకే చెల్లి ఎక్కడ ఉన్నా పండగ రోజు తన అన్న ఇంటికి వెళ్లి మరీ రాఖీ కడుతుంది. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం రాఖీని ఘనంగా జరుపుకుంటూ తమ ప్రేమను చాటుకుంటున్నారు. 

టాలీవుడ్‌లో సిస్టర్ సెంటిమెంట్‌తో ఎన్నో సినిమాలు రూపుదిద్దుకున్నాయి. పుట్టింటికి రా చెల్లి, రాఖీ, హిట్లర్ లాంటి సినిమాలు అన్నాచెల్లెళ్ల ప్రేమను చాటిచెప్పాయి. ఆ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద కాసులు కురిపించి సిస్టర్ సెంటిమెంట్‌కు తిరుగలేదనిపించాయి. అన్నాచెల్లెళ్ల బాండింగ్ పై అనేక సినిమాలు అందించి తెలుగు ప్రేక్షకులపై తిరుగులేని ముద్రను వేశాయి. అయితే రీల్ లైఫ్ లో కాకుండా... రియల్ లైఫ్‌లోనూ బంధాలకు ఎక్కడాలేని ప్రాధాన్యత ఇస్తూ రాఖీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు కొందరు తారలు. 

మహేశ్ మాత్రమే అర్థం చేసుకుంటాడు

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు ఇద్దరు అక్క లు. ఒక చెల్లెలు ఉన్నారు. మహేశ్ ఎంత బిజీగా ఉన్నాసరే రాఖీరోజు కచ్చితంగా తన సిస్టర్స్ తో గడిపేందుకు సమయం కేటాయిస్తాడు. అ యితే మిగతవాళ్లతో పోలిస్తే అక్క మంజులతో ప్రత్యేకమైన బాండిం గ్ ఉంది. “మహేష్ బాబు తాను ఎప్పుడూ మంచి మార్గంలో ఉండేలా గైడ్ చేస్తాడు. బేసిగ్గా నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ. కొన్నిసార్లు ఏం చేయాలో ఎలా చేయాలో తెలియదు. మహేష్ మాత్రమే అర్థం అ య్యేలా చెబుతాడు. మహేష్ ప్రేమ లోపల ఉంటుంది. దాన్ని బయటకు వ్యక్తం చేయడు. అలాగే నా ప్రతి పుట్టినరోజుకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్? ఈరోజు ప్లాన్స్ ఏంటి అని అడుగుతాడు.  కానీ హ్యాపీ బర్త్డే అని చెప్పడు. తన ప్రేమ అంతా మనసులోనే దాచుకుంటాడు” అని  మంజుల చెప్పారు.

అన్నయ్యే కాదు.. మంచి స్నేహితుడు కూడా

టాలీవుడ్ మెగా డాక్టర్ కొణిదెల నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇటీవల నిహారిక ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాను నిర్మించి సత్తా చాటుకుంది. నిహారిక సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. అంతకు మించి ఫ్యామిలీ మెంబర్స్‌కూ  ప్రాధాన్యత ఇస్తుంది. పేరెంట్స్ కన్నా తన అన్నయ్య వరుణ్ తేజ్‌తో మంచి బాండింగ్ ఉంది. అయితే ఏ బాండింగ్ అయినా పెరుగుతున్నకొద్దీ క్రమక్రమంగా సన్నగిల్లుతుంది.

కానీ నిహారిక, వరుణ్ తేజ్ మాత్రం చిన్నప్పుడు ఎంత ప్రేమగా ఉన్నారో.. పెద్దాయ్యాక కూడా అంతే ప్రేమగా ఉంటూ సోదరభావం చాటుకుంటున్నారు.  నిహారిక సినిమాలపరంగానే కాకుండా వ్యక్తి గతంగా ఎన్నో దెబ్బలు తిన్నది. అనివార్య కారణాల వల్ల చైతన్య జొ న్నలగడ్డతో విడిపోయిన స మయంలో ఎంతగానో కుంగిపోయింది. ఆ సమయంలోనే నేను న్నా అంటూ తన చెల్లి నిహారికకు మోరల్ స పోర్ట్ ఇచ్చా డు వరుణ్ తేజ్. చెల్లికి అండగా నిలిచి మళ్లీ సినిమాలవైపు ప్రోత్సహించాడు. ప్రస్తుతం నిహారిక వరుసగా సినిమాలు నిర్మి స్తూ బిజీబిజీగా ఉంది. ఇదంతా “తన అన్నయ్య వల్లే సాధ్యమైంది” అని చెబుతోంది నిహారిక. 

“మా బాల్యంలో ఎక్కువగా గొడవపడటం.. అమ్మనాన్నకు కంప్లుంట్ చేయడంతోనే సరిపోయేది. టామ్ అండ్ జెర్రీలా నిత్యం కొట్లాడుకునేవాళ్లం. అన్నయ్య చిన్నప్పుడు బాగా బరువుగా ఉండేవాడు. నన్ను ఎత్తుకుని మంచంపై పడేసేవాడు. నేను గోళ్ళతో గీకి కొట్టేదాన్ని. కొన్నిసార్లు రక్తం కూడా వచ్చేది” అంటూ తన బాల్యస్మృతులను గుర్తు చేసుకుంది నిహారిక. “మేం పెరిగి పెద్దయ్యాక ఇద్దరిలో అభిరుచులు మారాయి. కానీ బాండింగ్ మాత్రం అలానే ఉంది. నిహారిక చెల్లి మాత్రమే కాదు.. క్లోజ్ ఫ్రెండ్‌లా భావిస్తా. చెల్లితో అన్నీ విషయాలు డిస్కస్ చేస్తా” అని అంటున్నాడు హీరో వరుణ్ తేజ్ 

తమ్ముడికి ప్రేమతో

బుల్లితెర స్టార్ యాంకర్ గా శ్రీముఖికి మంచి పేరుంది. ఈమధ్య కాలంలో తక్కువ సంఖ్యలో షోలు చేస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి హవా కొనసాగుతోంది. నిత్యం సినిమాలు, షోలతో బిజీగా ఉండే శ్రీముఖి ఫ్యామిలీమెంబర్స్ తో సమయం గడిపేందుకు ఇష్టపడుతుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి.. ఇటీవల తన తమ్ముడు సుష్రుత్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చింది. ఖరీదైన ఫోర్డ్ కారుని బహుమతిగా ఇచ్చి ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

ఇది అక్కాతమ్ముళ్ల బంధానికి అద్దంపడుతుం ది. శ్రీముఖి బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు గెస్ట్ గా వెళ్లాడు సుష్రుత్. తన అక్క శ్రీముఖి వ్యవహారాలను వెనుకుండి చూసుకుంటాడు. గతంలో శ్రీముఖిపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ వైరల్ అయ్యింది. సైబర్ క్రైమ్స్ కు కంప్లైట్ ఇచ్చి తన అక్కకు అండగా నిలిచాడు. రక్షాబంధన్ రోజు ఎంత బిజీగా ఉన్న తన తమ్ముడిని కలుసుకొని రాఖీ కట్టించుకుంటోంది శ్రీముఖి. 

ఈ రోజంతా అక్కతోనే

ఇక టాలీవుడ్‌లో హీరో నితిన్, తన అక్క నిఖితారెడ్డి బాండింగ్ సో స్పెషల్. నితిన్ హీరోగా నిలదొక్కుకోవడానికి నిఖితారెడ్డి ఎంతగానో శ్రమించారు. అంతేకాదు.. తమ్ముడు నితిన్ కోసం శ్రేష్ట్ మూవీస్ అనే బ్యానర్ స్టార్ట్ చేసి ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించింది. నితిన్ వరుస పరాజయాలతో సతమతమవుతున్న సమయంలో ఇష్క్ లాంటి హిట్ ఇచ్చి కెరీర్ సాఫీగా సాగేలా చేసింది. తన తమ్ముడి సినిమాలను నిర్మించడమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది.

అంతేకాదు.. స్క్రిప్ట్ ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ తమ్ముడి కెరీర్ గాడిన పడేలా చేసింది. “నితిన్ నాకంటే చిన్నవాడే అయినా ఆలోచనలో నాకంటే పరిణితి. కఠినమైన దశను దాటిన అనుభవం అతనికి చాలా నేర్పింది. పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటాడు. ఉద్దేశపూర్వకంగా ఎప్పుడూ తప్పులు చేయడు. సినిమాల కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తాడు” అని తన అనుభవాలను షేర్ చేసుకుంది నిఖితారెడ్డి. “షూటింగ్ నిమిత్తం ఎక్కడఉన్నా సరే.. రాఖీ పండుగ రోజు మాత్రం కచ్చితంగా మా అక్క నిఖితారెడ్డి వద్దకు వెళ్లి రాఖీ కట్టించుకుంటా.

మా అక్కకు నేనంటే చిన్నప్పటి నుంచి ప్రాణం. అందరి అక్కలకు తమ్ముడి మీద ప్రేమ ఉంటుంది. కానీ మా అక్కది కొంచెం ఎక్కువ ప్రేమ. ఆమె రాఖీ కట్టగానే నేను ఏదో ఒక గిఫ్ట్ ఇస్తాను. ఇప్పుడు హీరోగా రేంజ్ పెరిగింది కాబట్టి గిఫ్ట్ రేంజ్ కూడా పెరిగింది. తమ్ముడిగా ఏం ఇవ్వకపోయినా ఆమె హ్యాపీగానే ఉంటుంది. కానీ నాకే అమెకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలని ఉంటుంది. అందుకే రాఖీ రోజు మాఅక్కతోనే ఉంటా” అని అంటాడు హీరో నితిన్.

అక్క కోసం నిర్మాతగా..

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన హీరోలలో నాచురల్ స్టార్ నాని ఒకరు. తెరపై కుటుంబ కథలను గొప్పగా ప్రజెంట్ చేయడమే కాదు.. నిజజీవితంలో బంధాలకు విలువిస్తూ ‘ఫ్యామిలీస్టార్’గా పేరు తెచ్చుకుంటున్నాడు. నాని ఒక ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి నిర్మాతగా సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. అయితే తన అక్క కోసం నిర్మాతగా మారాడు. యూట్యూబ్ లో  అనగనగా ఒక్క నాన్న అనే షార్ట్ ఫిలిం మంచి విజయం సాధించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే తన అక్క  ప్రతిభను గుర్తించిన నాని తన ప్రొడక్షన్ హౌస్ ద్వారా  దర్శకురాలిగా పరిచేయం చేశాడు. అయితే భవిష్యత్తులో తన అక్క దర్శకురాలిగా తెరకెక్కించే సినిమాలో నాని హీరోగా నటించినా ఏమాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక రాఖీ పండుగ రోజు ఎలాంటి సినిమా షూటింగ్స్ ఉన్నా.. అక్కతో రాఖీ కట్టించుకొని బెస్ట్ బ్రదర్ అనిపించుకుంటున్నాడు.