మంథని, (విజయక్రాంతి): కమాన్ పూర్ మండలా యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రాజు రేబల్ లను నియమించినట్లు కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు దుద్దిళ్ల శ్రీనుబాబు తెలిపారు. రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమాన్ పూర్ మండల యూత్ అధ్యక్షుడిగా రాజు రేబల్ ను నియమించినట్లు శ్రీనుబాబు తెలిపారు. తన నియమానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబుకు, యువ నాయకుడు శ్రీను బాబుకు, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జెమినీ గౌడు కు, నియోజకవర్గం అధ్యక్షులు బర్ల శ్రీనివాస్ కు రాజు రెబల్ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతికి కోసం కృషి చేస్తానన్నారు.