calender_icon.png 18 March, 2025 | 7:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

టీబీఎన్‌ఆర్‌కేఎస్ మండల అధ్యక్షుడిగా రాజు

14-03-2025 12:00:00 AM

బచ్చన్నపేట, మార్చి 13: టీబీ ఎన్‌ఆర్‌కేఎస్(భవన నిర్మాణ అ నుబంధ రంగ సంఘం) బచ్చన్నపేట మండల కమిటీ అధ్యక్షుడిగా జేరిపోతుల రాజు ఎన్నికయ్యారు. గు రువారం మండలకేంద్రంలో కొమ్మగళ్ల కృష్ణ అధ్యక్షతన జరిగిన సమా వేశంలో సంఘం జనగామ  జిల్లా అధ్యక్షుడు తూడి అంజయ్య ఆధ్వర్యంలో మండల కమిటీని ఎన్నుకు న్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ..  భ వన నిర్మాణ రంగాల కార్మికులు ఐక్యతతో పని చేయాలని పిలుపునిచ్చారు.

ఇన్సూరెన్స్ కంపెనీలకు సం బంధం లేకుండా ప్రభుత్వమే కార్మికులకు సంక్షేమ పథకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అల్వాల ఎల్లయ్య, దామర బాలనర్సయ్య, వేములవాడ వెంకటచారి, మేడిపల్లి వెంకటేష్, తుడుం రాజ్ కుమార్  తదితరులు పాల్గొన్నారు.