calender_icon.png 11 January, 2025 | 8:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజ్‌తరుణ్‌కు ప్రాణహాని

04-08-2024 02:16:45 AM

ఆయన మరో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ కావొద్దు

లావణ్యవి తప్పుడు ఆరోపణలు

ఆమె బ్లాక్‌మెయిల్ చేసి డబ్బు లాగాలని చూస్తున్నారు: అడ్వకేట్ మధుశర్మ 

నార్సింగి పీఎస్‌లో రాజ్‌తరుణ్ తరఫున ఫిర్యాదు

రాజేంద్రనగర్, ఆగస్టు 3: లావణ్య నుంచి నటుడు రాజ్‌తరుణ్‌కు ప్రాణహాని ఉందని, ఆయన మరో సుశాంత్ రాజ్‌పుత్‌లా బలి అయ్యే పరిస్థితులు రాకుండా తాను ఆశిస్తున్నానని రాజ్‌తరుణ్ తరఫు న్యాయవాది మధుశర్మ అన్నారు. శనివారం ఆయన నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో లావణ్యపై ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. లావణ్యకు డ్రగ్స్‌కు మధ్య ఉన్న సంబంధాలెంటో మూడు రోజుల్లో వెల్లడిస్తామన్నారు.

లావణ్య యువతులకు డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశా రు. తమ వద్ద వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయన్నారు. రాజ్‌తరుణ్‌పై లావణ్య చేసిన ఆరోపణల్లో ఏమా త్రం నిజం లేదన్నారు. తన డిమాండ్లను ఒప్పుకోవడం లేదని ఆమె నానారకాలుగా రాజ్‌తరుణ్‌ను బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. ప్రీతి, ఉదయ్ అనే వ్యక్తులు కూడా లావణ్య తమకు డ్రగ్స్ అలవాటు చేసిందని నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని గుర్తుచేశారు. న్యాయపరంగా తాము ఎంతదూరం వెళ్లేందుకైనా సిద్ధంగా ఉన్నామన్నారు. వినీత్‌రెడ్డి అలియాస్ చింటూతో లావణ్యకు సంబంధం ఉందని ఆరోపించారు.