05-03-2025 08:29:16 PM
హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 300వ జయంతి వేడుకలు...
ఎల్బీనగర్: రాజమాత అహిల్యాబాయ్ హోల్కర్ మహిళలకు ఆదర్శనీయమని హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ సురేశ్ బాబు అన్నారు. హయత్ నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రాజమాత అహిల్యా బాయ్ 300వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏబీఆర్ ఎస్ఎం (అఖిల భారత రాష్ట్రీయ శైక్షిక్ మహాసంగ్) ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్ అధ్యక్ష స్థానం వహించిన కళాశాల ప్రిన్సిపూల్ డాక్టర్ సురేశ్ బాబు మాట్లాడుతూ.. రాజమాత అహిల్యాబాయ్ పరిపాలన దక్షిత ఆర్థిక స్వావలంబన ఆధ్యాత్మికత, న్యాయపరంగా చరిత్రలో అత్యున్నత వ్యక్తిగా నిలిచారన్నారు.
ప్రొఫెసర్ నాగేంద్ర మాట్లాడుతూ.... అహిల్యాబాయ్ చూపిన స్వావలంబన బాటలో నేటి యువత పయనించాలన్నారు. కార్యక్రమానికి సమన్వయకర్తగా తెలుగు అధ్యాపకుడు ఎ.మల్లేశం వ్యవహరించారు. కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ నర్సింహ, అధ్యాపకులు డాక్టర్ జి.వెంకటలక్ష్మి, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ నాగరాజు, డాక్టర్ యాదయ్య, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ యాదగిరి రెడ్డి, డాక్టర్ దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.