calender_icon.png 17 January, 2025 | 3:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోషకాల గని రాజ్మా!

09-09-2024 02:30:00 AM

కిడ్నీ బిన్స్‌గా పిలువబడే రాజ్మా గింజలు భారతీయ వంటకాల్లో సాధారణ తృణ ధాన్యం. ఇది చిక్కుడు జాతికి చెందినది. చిన్నగా, ఎర్రగా ఉండే రాజ్మా బీన్స్ రుచికరమైనవి మాత్రమే కాదు.. ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటాయి. రాజ్మా వల్ల కలిగే ప్రయోజనాలెంటో చూద్దాం..

  1. రాజ్మా గింజల్లో పోటీన్ శాతం అధికంగా ఉంటుంది. శరీరంలో కణజా లాలను తయారు చేయడానికి, మరమ్మతు చేయడానికి ప్రోటీన్ అవస రం. ఇది మొత్తం ఆరోగ్యానికి కీలకమైన పోషకం. ఆహారంలో రాజ్మా గింజలను ఉపయోగించడం వల్ల కం డరాల పెరుగుదలకు తోడ్పడతాయి. 
  2. రాజ్మాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు ఫైబర్ ముఖ్యం. ఇది మలబద్ధకం, జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. 
  3. ప్రోటీన్, ఫైబర్‌తో పాటు రాజ్మా గిం జలు అవసరమైన విటమిన్లు, ఖనిజాలతో నిండి ఉంటాయి. వీటిలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, ఫోలేట్ ఉన్నాయి. ఇవన్నీ వివిధ శారీరక విధుల్లో కీలక పాత్ర పోషిస్తాయి. రాజ్మా గింజలను తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముక ఆరోగ్యానికి సహాయపడతాయి. 
  4. రాజ్మా గింజలు గుండె ఆరోగ్యంపై ప్రయోజనకరమైన ప్రభావాలను చూపుతాయని తేలింది. వీటిలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడే సమ్మేళనాలు ఉంటాయి. రాజ్మా తీసుకోవడ వల్ల గుండె సంబంధిత సమస్యలు దూరం అవుతాయి.