- పేర్లు నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రకటన
కనీస ధరకే కేటాయించే అవకాశం!
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 3 (విజయక్రాంతి): గ్రేటర్ పరిధిలోని జర్నలి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. నగరంలోని బండ్లగూడ, పోచారం, గాజుల రామారం, జవహర్‌నగర్ ప్రాంతాలలో నిర్మాణం చేసిన రాజీవ్ స్వగృహ ఇండ్లను బహిరంగ వేలం వేయాలని ప్రభుత్వం భావించింది.
అయితే ఈ వేలంలో ప్రభు నిర్ణయించిన కనీస ధరకే గ్రేటర్ హైదరాబాద్‌లోని జర్నలిస్టులకు ఆయా ఇండ్లను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పీఆర్వో రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
గ్రేటర్ పరిధిలోని రాజీవ్ స్వగృహ ఇండ్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి కలిగిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు చెందిన జర్నలిస్టులు ఈనెల 5వ తేదీలోగా 77020 03518 నంబర్‌కు వాట్సాప్ ద్వారా వివరాలు పంపి తమ పేర్లను నమోదు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంపై టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్ అలీ స్పందిస్తూ తెంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో జర్నలిస్టులకు మేలు జరుగుతుందని అన్నారు.