calender_icon.png 19 March, 2025 | 9:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాసం పథకం కార్పొరేషన్ల అధికారుల ద్వారానే అమలు చెయ్యాలి

18-03-2025 06:37:46 PM

రాజీవ్ యువ వికాసం పథకంలో రాజకీయ జోక్యం లేకుండా చూడాలి...

బ్యాంకు లింకేజ్ లేకుండా సబ్సిడీ రుణాలు రూ. 10 లక్షలకు పెంచాలి...

కేవీపీఏస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్...

సంగారెడ్డి (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చే సబ్సిడీ రుణాల లబ్ధిదారుల ఎంపిక ఎమ్మెల్యేల ద్వారా చేయాలనే నిర్ణయం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రాజకీయ నాయకుల జోక్యం లేకుండా కార్పొరేషన్ల అధికారుల ద్వారానే రాజీవ్ యువ వికాసం పథకం అమలు చేయాలని కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మానిక్ డిమాండ్ చేశారు. మంగళవారం కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఏస్) ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టరెట్ ఏఓ పరమేశంకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ మాట్లాడుతూ... ఇటీవలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సబ్సిడీ రుణాల ఇచ్చేందుకు రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలకు చేస్తారని ముఖ్యమంత్రి చెప్పడం సరైనది కాదని అన్నారు. గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో దళిత బంధు పథకం అమలు చేశారని అన్నారు. నిజమైన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతారని, రాజకీయ పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు. బ్యాంకు లింకేజ్ పెట్టడంతో లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి వస్తుందని అన్నారు బ్యాంక్ లింకేజ్ లేకుండా పది లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి అశోక్, జిల్లా సహాయ కార్యదర్శి దాసు, జిల్లా నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.