calender_icon.png 1 April, 2025 | 8:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువ వికాసం పథకం గడువు పెంచాలి

29-03-2025 10:12:29 PM

రణపంగ కృష్ణ సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు..

పెన్ పహాడ్: రాజీవ్ యువ వికాస పథకం గడువు పెంచాలని సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు రణపంగ కృష్ణ ప్రభుత్వానికి కోరారు. సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఉగాది రంజాన్ సెలవులతో పాటు ఆదివారం కావడంతో పాటు అనేక మంది యువతి, యువకులు దరఖాస్తూ చేసుకోవడం వలన కుల, ఆదాయ సర్టిఫికెట్లు ఇవ్వడంలో స్థానిక తాసిల్దార్ ఆఫీస్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. రాజీవ్ యువ వికాస పథకంకు యువతి యువకులు ఆశగా గత వారం రోజుల నుండి తాసిల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతునన్నా క్యాస్ట్ సర్టిఫికెట్ చేతికి రావడం లేదు అందుకే ఏప్రిల్ 15వ తారీకు వరకు గడువు పెంచి యువతి యువకుల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.