26-03-2025 05:49:49 PM
రేషన్ కార్డుతో సంబంధం లేకుండా దరఖాస్తులు తీసుకోవాలి..
ఎంసిపిఐయు పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ డిమాండ్..
బెల్లంపల్లి (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం గడువు పెంచాలని ఎంసిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వేంకటేష్ లు డిమాండ్ చేశారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం బాగానే ఉందన్నారు. కానీ తహసిల్దార్ ఆఫీసులలో క్యాస్ట్, ఇన్కమ్ సైట్ ప్రాబ్లమ్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అదేవిధంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పథకానికి అర్హులుగా గుర్తించాలన్నారు. తహసిల్దార్ ఆఫీసులో క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్లు కూడా వేగవంతం చేయాలని, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్పందించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.