13-04-2025 03:16:26 PM
పనిచేయని ఆన్‌లైన్ సర్వర్
పథకం పట్ల అవగాహన కల్పించటంలో అధికారుల నిర్లక్ష్యం
నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
మైనారిటీ జిల్లా అద్యక్షుడు ఎండి. యాకూబ్ పాషా
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకానికి ఆన్‌లైన్ చేసుకునేందుకు గడువు తేదీని పొడిగించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎండీ. యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. వెబ్ సైట్ పనిచేయకపోవడంతో రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తు చేసుకుంటున్న దరఖాస్తు దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
ఆన్‌లైన్ సక్రమంగా పనిచేయని కారణంగా వేల సంఖ్యలో దరఖాస్తుదారులు నష్టపోయే ప్రమాదం ఉందని, ప్రభుత్వం వెంటనే ఆన్‌లైన్ గడువును పొడిగించాలని కోరారు. పథకం పట్ల దరఖాస్తు దారులకు సరైన అవగాహన లేకపోవడంతో అర్హత ఉన్న ఆసక్తి చూపడం లేదన్నారు. రాజీవ్ యువ వికాసం పథకం పట్ల అవగాహన కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని మండిపడ్డారు. అధికారుల తీరుతో ప్రభుత్వ లక్ష్యం నీరు గారే అవకాశం ఉందని, తద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుందని తక్షణమే ఆన్లైన్ గడువు పెంచడంతోపాటు, ప్రజలకు ఈ పథకం పట్ల అవగాహన కల్పించేలా అధికారులకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు