calender_icon.png 20 April, 2025 | 11:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజీవ్ యువవికాసం గేమ్‌ఛేంజర్

17-04-2025 01:56:49 AM

బ్యాంకర్లతో సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకంతో నిరుద్యోగుల జీవితాలు మారుతాయని, వా రి జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. రాజీవ్ యువ వికాసం ఒక గేమ్ చేంజర్‌గా నిలుస్తోందని వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం అమలుపై బ్యాంక్‌లతో ప్రత్యేక సమావేశంలో భట్టి విక్రమార్క మల్లు మాట్లాడారు.

ఈ పథకాన్ని ఒక సాధారణ సంక్షేమ పథకంగా చూడొద్దని బ్యాంకర్లను కోరారు. రాజీవ్ యువ వికాసం ద్వారా ఆర్థికంగా, సామాజికంగా రాష్ట్రంలోని యువత కు సహాయపడేందుకు బ్యాంకర్లు తోడ్పాటు అందించాలని కోరారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నుంచి కమిషనర్ల వరకు ఈ పథకం రూపకల్పన, ఎంపికైన వారికి శిక్షణపై తీవ్ర కసరత్తు చేసినట్టు డిప్యూటీ సీఎం భట్టి వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం రూ.6,000 కోట్లు ఖర్చు పెడుతోందని, బ్యాంకర్ల రూ.1,600 కోట్లు లింకేజీ ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. యువవికాసం ద్వారా లబ్ధి పొందే యువకులకు వ్యాపారం చేసుకోవడం, లాభాలు సాధించడంపై అధికారులు కనీసం 3 రోజుల నుంచి 15 రోజుల వరకు శిక్షణ ఇస్తారన్నారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా స్థాయి లో కలెక్టర్లు బ్యాంకర్లతో త్వరలో సమావేశా లు నిర్వహించాలని ఆదేశించారు.

అర్హులకు శాంక్షన్ లెటర్లు అందజేసిన తర్వాత మరోసారి రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా విడుదల కాగానే బ్యాంకర్లు లింకేజీ మొత్తాన్ని వెంటనే విడుద ల చేయాలని కోరారు. ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, ఎస్సీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, ఎస్టీ సంక్షేమ శాఖ సెక్రటరీ శరత్, బీసీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీధర్, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్, అన్ని శాఖల బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు.