01-04-2025 02:04:14 AM
14 వరకు అవకాశం
హైదరాబాద్, మార్చి 31 (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం దరఖాస్తు గడువును రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈనెల ౫వ తేదీతో గడువు ముగియనుండటంతో దా న్ని ఈనెల 14 వరకు పొడిగిస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. సోమవారం ప్రజాభవన్ నుంచి ఆయన సీఎస్, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో యువ వికాసంపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్ని మండల పరిషత్, పురపాలక కార్యాలయాల్లో యువవికాసం దరఖాస్తు ఫారాలను అందుబాటులో ఉంచాలని సూచించారు.