19-03-2025 01:08:57 AM
కడ్తాల్, మార్చి 18 ( విజయ క్రాంతి ) : రాష్ట్రంలో ఐదు లక్షల మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ఆలోచనతో 6 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం కార్యక్రమాన్ని చేపట్టిందని డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
మంగళవారం కడ్తాల్ మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి విలేకరులతో మాట్లాడారు.స్వయం ఉపాధి కింద అర్హులైన నిరుద్యోగ యువతీ, యువకులకు ఈ పథకం ప్రయోజనం చేకూరాలని, సీఎం రేవంత్ రెడ్డి పథకాన్ని ప్రారంభించడం హర్షనీయమన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు ఆర్థిక సాయం అందించడానికి ఉద్దేశించిన పథకాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
నైపుణ్యం ఉండీ ఉద్యోగం లభించని యువతకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు ఉద్దేశించిన ఈ పథకం ముందు ముందు మరింత పటిష్టంగా అమలు చేస్తారని అన్నారు. ఈ సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బీచ్యా నాయక్, జిల్లా నాయకుడు బీక్యా నాయక్, చేగూరి వెంకటేష్, రాంచందర్ నాయక్, జహంగీర్ అలీ పాల్గొన్నారు .