12-04-2025 04:52:57 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టత్మకంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. (Rajiv Yuva Vikasam Scheme) దీని ద్వారా రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అయితే రాజీవ్ యువ వికాసం దరఖాస్తుల గడువు ఎల్లుండితో ముగియనున్న తరుణంలో తీవ్ర సమస్యలు తలెతున్నాయి. సర్వర్ లోపాలు, సాంకేతిక సమస్యలతో దరఖాస్తుల ప్రక్రియ ముందుకు సాగకపోవడంతో దరఖాస్తుదారులు ఇంటర్నెట్, మీసేవ కేంద్రాల వద్ద పడిగాపలు కాస్తున్నారు. కొన్నిసార్లు అప్లికేషన్ చివరిదశకు వెళ్లి సర్వర్లు మొరాయిస్తున్నాయని, దరఖాస్తు సమర్పిచిన తర్వాత దరఖాస్తు ఫారం డౌన్ లోడ్ కావడంలేదని, మళ్లీ దరఖాస్తు చేస్తే ఆల్రెడీ అప్లైడ్ అని వస్తోందని దరఖాస్తుదారులు వాపోతున్నారు.