11-04-2025 12:00:00 AM
ముషీరాబాద్ తహసీల్దార్ రాణా ప్రతాప్ సింగ్
ముషీరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుపేద ఎస్సీ ,ఎస్టీ , బీసీ, ఈబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎంబీసీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన యువతీ యువకులు స్వయం ఉపాధి పథకాల కోసం రుణం పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని ముషీరాబాద్ తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్ గురువారం తెలిపారు.
దరఖాస్తుదారులు స్థానికంగా ఉన్న వార్డు కార్యాలయంలో దరఖాస్తులను అందజేయాలని సూచించారు. రూ. 50 వేల నుంచి రూ. 4 లక్షల వరకు ఈ పథకం ద్వారా అర్హులైన ప్రజలు లబ్ధిపొంద వచ్చన్నారు. ఈ నెల 14 వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. జీహెచ్సీ సర్కిల్-15 లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన చెప్పారు.